»Summer 13 Dies Of Heatstroke At Maharashtra Bhushan Award Ceremony
Bhushan Award మహారాష్ట్రలో ఘోరం.. అవార్డు వేడుకలో వడదెబ్బతో 13 మంది మృతి
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. ఎండలు మండుతుంటే అదే ఎండలో వేలాది మంది ప్రజలను తరలించారు. అయితే ఆ సభలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. తీవ్రమైన ఎండలో కూర్చోవడంతో ఏకంగా 600 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 13 మంది మృతి చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా సభ నిర్వహించడంతో ప్రజలు మృతి చెందారనే విమర్శలు వస్తున్నాయి. వారి మరణాలకు కారణం అమిత్ షా, షిండేలు అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
మహారాష్ట్ర అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం నేవీ ముంబైలో ఆదివారం జరిగింది. ఖర్గార్ లోని మైదాన ప్రాంతంలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 80 వేల మంది ప్రజలు తరలివచ్చారు. ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. అలా ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే బాధితులను ఆస్పత్రులకు తరలించారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వెంటనే ప్రాథమిక వైద్యం అందించారు. అయితే చికిత్స పొందుతూనే 13 మంది మృతి చెందారు. వారంతా వడదెబ్బకు గురై చనిపోయారు. సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. బాధితులను మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.