»Pakistan Minister Mufti Abdul Shakoor Dies At 55 In Car Accident
Islamabad రోడ్డు ప్రమాదంలో పాకిస్థాన్ మంత్రి దుర్మరణం
కారు వెళ్లి గోడను ఢీకొట్టడంతో మంత్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
పాకిస్థాన్ (Pakitan)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రి ముఫ్తీ అబ్దుల్ షకూర్ (55) (Mufti Abdul Shakoor) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఆ దేశంలో విషాదం అలుముకుంది. అతడి మృతికి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ (Ramadan) మాసంలో అతడు చనిపోవడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad)లో ఏప్రిల్ 15న శనివారం రాత్రి అబ్దుల్ షకూర్ తన కారులో వెళ్తున్నారు. సెక్రటరీ చౌక్ (Secretary Chowk)కు వెళ్తున్న క్రమంలో అతడి కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీని ధాటికి కారు వెళ్లి గోడను ఢీకొట్టడంతో మంత్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘మంత్రి కారులో ఒక్కరే వెళ్తున్నారు. తీవ్ర గాయాలతో మంత్రి ఘటనా స్థలంలోనే చనిపోయారు. వెనుకాల వవస్తున్న నిర్లక్ష్యంగా కారు నడపంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని ఇస్లామాబాద్ పోలీస్ అధికారి అక్బర్ నసీర్ ఖాన్ తెలిపారు. జమియాత్ ఉలెమా-ఇ- ఇస్లామ్ ఫజల్ (జేయూఐ-ఎఫ్) పార్టీకి చెందిన అబ్దుల్ షకూర్ పాకిస్థాన్ లో సీనియర్ నాయకుడు. లక్కి మార్వట్ జిల్లాలోని తజ్బీ ఖేల్ లో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.
⚡️ Pakistan's federal minister for religious and haj affairs, Mufti Abdul shakoor killed by unknown people in Islamabad in a car ramming incident; Driver claimed arrested. Accomplices absconding pic.twitter.com/mib1sKAb4c