CTR: కుప్పం అన్న క్యాంటీన్‌ను బుధవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఏ మేరకు నాణ్యతతో అన్నం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 4 మండలాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ అన్న క్యాంటీన్లోనే భోజనం చేశారు.