KMM: మంత్రి పొంగులేటిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని మద్దులపల్లి మార్కెట్ ఛైర్మన్ హరినాథ్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం కూసుమంచి మంత్రి క్యాంప్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న BRS పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. ఆ పార్టీ నేతలు పొంగులేటిని విమర్శించడం సిగ్గుచేటన్నారు.