కోనసీమ: రాష్ట్రంలో ఉన్న పలు సంక్షేమ హాస్టళ్లను ఆధునీకరించేందుకు నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ మేరకు గురువారం రాజోలు మండలం శివకోడులో ఉన్న గురుకుల సంక్షేమ హాస్టల్‌ను ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.