ADB: ఆపత్కాలంలో ఉన్న అతివలకు అండగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్ లోని సఖీ కేంద్రాన్ని ASP కాజల్సింగ్తో కలిసి ఎస్పీ సందర్శించారు. కేంద్రం ద్వారా మహిళలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ముఖ్యంగా కుటుంబ కలహాలతో ఉన్న మహిళలకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ సేవలు అందించనున్నట్లు చెప్పారు.