BDK: దమ్మపేట బస్టాండ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామసభ తీర్మానం జరగకుండా పెట్రోల్ బంక్ నిర్మాణంపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని సమాచార హక్కు చట్టం ప్రకారం.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. బస్టాండ్ ప్రాంగణంలోని స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మాణం ఎలా నిర్మిస్తారని మండిపడ్డారు.