NZB: ఆర్మూర్ మండలం పిప్రి ZPHS పాఠశాలలో శుక్రవారం గ్రంథాలయాన్ని హెడ్మాస్టర్ విశ్వనాథ్ ప్రారంభించారు. ఓ విజ్ఞాన సమాజాన్ని సృష్టించడానికి పుస్తక పఠనం ఎంతో అవసరం అన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. రకరకాల మాధ్యమాలు ఏర్పడిన పుస్తకం ప్రాముఖ్యత ప్రత్యేకమైనది అన్నారు. వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఏర్పరచడానికి పుస్తకాలు ఎంతో సహకరిస్తాయన్నారు.