NLR: వరికుంటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందని ఎంపీడీవో కే శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ జి. వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.