VZM: విజయనగరం పట్టణాన్ని వాయు కాలుష్యం లేని నగరంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్రింద కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం అయన ఛాంబర్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.