కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్లో మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తొలుత ఆమెకు క్షమాభిక్ష దక్కితే.. తర్వాత బ్లడ్ మనీ అంశం చర్చకు వస్తుందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు.