ASR: హుకుంపేట మండలం తాడిపుట్టులో బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. సుబ్బారావుకు చెందిన బైక్ ను ఇద్దరు చోరీ చేసి తీసుకెళ్తుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారు పరుగులు తీశారు. గ్రామస్తులు ఓ వ్యక్తిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.