కృష్ణా: నాగాయలంక బ్యాక్ వాటర్ పాయల్లో శుక్రవారం వేటకు వెళ్లిన జాలర్లకు అదృష్టం కట్నంగా రెండు భారీ టేకు చేపలు వలలో చిక్కాయి. లంకేవానిదిబ్బ సమీపంలో తిరుమలశెట్టి బాలు బృందం పట్టిన ఈ చేపలు ఒక్కోటి 50 కిలోల బరువు ఉండగా, రూ.150కి కిలో ధర పలుకుతుండటం విశేషం అని తెలిపారు. చేపలను శ్రీరామ పాద క్షేత్ర ఘాట్‌కు తీసుకొచ్చారు.