ELR: ఏలూరు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి హౌసింగ్ శాఖను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అవసరమైన ఇసుక నిల్వలను సిద్ధం చేయాలన్నారు. నిల్వ చేసిన ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రిలో అవకతవకలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు అందినా సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.