ASF: విద్యార్థులకు బడి బాటతో పాటు పొలం బాటను ఉపాధ్యాయులు చక్కగా నేర్పిస్తున్నారు. పెంచికల్ పేట్ మండలం బొంబాయిగూడ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పొలం బాట పట్టారు. శుక్రవారం క్షేత్ర పరిశీలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల సమీపంలోని పొలానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కూలీలతో కలిసి పొలం పనుల గురించి తెలుసుకున్నారు.