NLR: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 66 మందిని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా నియమించింది. నెల్లూరు జిల్లా కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పోతుగంటి అలేఖ్య నియమితులయ్యారు. ఆమె గతంలో కావలి పురపాలక సంఘ ఛైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆమె తండ్రి గ్రంధి యానాదిశెట్టి కూడా కావలి పురపాలక, మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పని చేశారు.