NDL: బండిఆత్మకూరు మండలంలోని గిరిజనులు నివసిస్తున్న నెమళ్లకుంట గూడెం అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. P4 కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు ఇవాళ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గృహోపకరణాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నెమళ్లకుంట గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.