BDK: నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్, ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్ అవార్డులను భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందుకున్నారు. జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా, జిల్లా కలెక్టర్ గురువారం బాంబే ఐఐటీలో నిర్వహించిన ఓపెన్ సోర్స్ GIS డేలో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డులను ISRO మాజీ ఛైర్మన్ ఏ.ఎస్.కిరణ్ కుమార్ ప్రదానం చేశారు.