VSP: విశాఖ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన తనిఖీల్లో రైల్వే పోలీసులు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన హేమంత్ జానీ అనే వ్యక్తి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సీహెచ్. ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ఎస్సై ఎస్. రామారావు తమ సిబ్బందితో కలిసి ప్లాట్ ఫారాలపై తనిఖీలు నిర్వహించారు.