ASF: కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దీత్రే అధ్యక్షతన సంస్థాగత సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులకు అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించి, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి త్వరలో మంత్రుల చేతుల మీదుగా అందించేందుకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.