NLG: గుర్రప్పగూడెం, చిన్నగూడెం, బొమ్మకల్లు, భీమనపల్లి, చిరుమర్తి, జంగారెడ్డిగూడెం గ్రామాల నుంచి విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ మండల ఇన్చార్జి జిల్ల నగేశ్, మండల ఇన్చార్జి శివకుమార్ తెలిపారు. ఆగమోత్కూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు.