ELR: ఒక కేసు విచారణలో భాగంగా గిరిజన వృద్ధుడు గుజ్జు లక్ష్మణుడును బుట్టాయగూడెం ఎస్సై తీవ్రంగా కొట్టారంటూ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆయా సంఘాల నేతలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్ముడుని గురువారం పరామర్శించారు. ఆస్పత్రి ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు