KMR: పిట్లం నుంచి బాన్సువాడ వరకు రోడ్డు పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. పనులు నెమ్మదిగా సాగుతుండటంతో పాటు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో విపరీతంగా దుమ్ము లేస్తోంది. నీళ్లు చల్లి దుమ్మును నియంత్రించే ప్రయత్నం కూడా కాంట్రాక్టర్ చేయడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.