NLR: ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులకు సెంట్రల్ రోడ్డు ఫండ్ ఇవ్వాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వరికుంటపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నందవరం – నందిపాడు రూ. 35 కోట్లు, ఆత్మకూరు – సోమశిలకు రూ. 25 కోట్లు కేటాయించాలని కోరామన్నారు.