కోనసీమ: రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో దేశ ప్రధానిగా మోడీ 11 సంవత్సరముల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆద్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంటింటికి తిరిగి ప్రధాని మోడీ అభివృద్ధి పథకాల కరపత్రాలను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.