PLD: దాచేపల్లి టౌన్‌లోని నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రేపు నిర్వహించనున్న ‘కిసాన్ మేళా’ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇది ఓ మంచి వేదిక అవుతుందని తెలిపారు.