KMM: కూసుమంచి మండలం హైస్కూల్ ప్రాంగణంలో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.