KDP: దువ్వూరు మండలం గుడిపాడులో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి రామకృష్ణ, వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఈ పంట సాగు చేయుటకు రైతులకు ఉద్యానశాఖ రూ.29 వేలు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.