KMM: నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో బుధవారం సిమెంట్ కట్టలు తరలించే ఆటో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ఒకరికి కాలు విరిగి రోడ్డు పక్కన పడి ఉండగా స్థానికులు ఆటో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు బొదులబండ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. బోదులబండ నుండి రామచంద్రాపురం కట్టలు తరలిస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది.