TPT: ఏర్పేడు మండలం ముసలిపేడు పంచాయతీ బత్తినయ్య ఎస్టీ కాలనీలో బుధవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. ఇప్పటికే ఉచిత గ్యాస్, తల్లికి వందనం లాంటి హామీలను అమలు చేసినట్లు తెలిపారు.