HYD: మలక్పేట్ కాల్పుల కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సీపీఐ నేత చందూపై నిందితులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితుడు రాజేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురు నిందితులపైనా గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయి.