కోనసీమ: రాజోలులో పుష్ప (22) ప్రియుడు షేక్ షమ్మా చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. భర్తకు విడాకులిచ్చి నాలుగేళ్ల కుమారుడితో ఉంటోంది. ఈ క్రమంలో షేక్ షమ్మాతో వివాహేతర సంబంధం కొనసాగించింది. డబ్బుల కోసం అతను పుష్పను వ్యభిచారం చేయమని బలవంతం చేసేవాడు. ఒప్పుకోకపోవడంతో బుధవారం రాత్రి చాకుతో పొడిచి హత్య చేశాడు. అడ్డొచ్చిన మృతిరాలి తల్లి, అన్నకు కూడా గాయాలయ్యాయి.