VZM: మంచినీటి పథకాలు, రహదారుల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. గురువారం సాలూరులో మంత్రి కార్యాలయంలోని సచివాలయం, ఇంజనీర్, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతు.. మౌలిక సదుపాయలు, ఆరోగ్యం, మహిళా సాధికారతపై అధికారులకు పలు సూచనలు చేశారు.