NLG: మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. మూడేళ్లుగా రుణాలు తీసుకుని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళల సంఘాలకు రూ. 38.63 కోట్లు విడుదల చేసింది.