TG: హైదరాబాద్లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల విషయంలో మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి నుంచి పగలు కూడా టెస్టులు చేస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. ఉదయం వేళల్లో స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. మైనర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు.