KMM: మధిర శివాలయం సబ్ స్టేషన్ అల్లినగరం ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు అల్లినగరం, బయ్యారం, మడుపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.