TG: ఆదిలాబాద్లో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులే టార్గెట్గా మోసాలకు పాల్పడింది. ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి యాజమాన్యం రూ.20వేలు వసూలు చేసింది. ఇలా 500 మంది నుంచి డబ్బులు తీసుకొని చివరకు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సంస్థ ముందు ఆందోళనకు దిగారు.