VSP: సమస్త జీవరాశితో భూగోళం కళకళలాడాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా సబ్బవరంలోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాలలో ఇవాళ నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.