కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వెణుతురుమిల్లి గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండలంలోని ప్రతి రైతు పంట బీమా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సునీల్ అన్నారు. క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు సంబంధిత బ్యాంకులు పంటల బీమా కింద ప్రీమియం చెల్లింపులు చేస్తారని, ఎకరాకు రూ.830 సీఎస్సీ సెంటర్లో ప్రీమియం చెల్లించాలన్నారు.