KMM: నగరంలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ వద్ద డివైడర్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. నగరంలోని డివైడర్ల మధ్యలో మొక్కలను నాటడం వల్ల అహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ పేర్కొన్నారు.