NRML: బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణిలో నియోజకవర్గ ప్రాంతం నుండి వచ్చిన వివిధ ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని పరిష్కరించాలని, న్యాయ సహాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.