చైనాలో పర్యటించిన విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని అన్నారు. జమ్మూకశ్మీర్‌ను పర్యాటకంగా దెబ్బతీసేందుకు పహల్గామ్లో ఉగ్రవాదులు దాడిచేశారని.. పాక్, చైనా మంత్రుల సమక్షంలోనే తెలిపారు. సభ్యదేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని అందరూ గౌరవించాల్సిందేని అన్నారు.