W.G: మధ్యాహ్న భోజన పథకంలో ఏవిధమైన సమస్యలు వచ్చినా తెలియజేయాలని, సమస్యలను ఎమ్మెల్యే అంజిబాబు, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి పార్ధసారథి అన్నారు. బుధవారం భీమవరం ఎఆర్కెఆర్ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలన్నారు.