సత్యసాయి: మడకశిరలోని మధుగిరి రోడ్డులో జైభీమ్ ఆటో స్టాండ్‌ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.