AP: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందని చెప్పారు. ఈనెల 21 నాటికి జలవివాదాల పరిష్కార కమిటీ ఏర్పాటు అవుతుందని అన్నారు. కమిటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉంటారని స్పష్టం చేశారు.