MLG: వెంకటాపూర్ మండలం జవహర్ నగర్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. 12 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం సేకరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేయాలనే రైతులకు ఉచితంగా ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.