ATP: పెద్దవడుగూరులో చేనేత కార్మికులకు మగ్గం పరికరాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పంపిణీ చేశారు. మొదటి విడతగా 156 లబ్ధిదారులకు త్రీ లీవర్, టూ లీవర్ మిషన్లు, ఫ్రేమ్ రూములు అందించారు. పరికరాలు మనిషి శ్రమను తగ్గించి ఆదాయం పెంచేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.