ASF: కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో జీవో- 49 ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చింతలమానేపల్లి MRO, FROలకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ.. పేసా చట్టం ప్రకారం జీవో రద్దు చేయాలని ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి తీర్మానం చేశామన్నారు. జీవో రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమలు చేపడతామన్నారు.