KMM: సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ముందుగా సత్తుపల్లిలోని ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొంటారని చెప్పారు. అనంతరం పెనుబల్లి(మం) పాత కుప్పెనకుంట్ల నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించి ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలన్నారు.