NLR: విడవలూరు మండలంలో వరిణి గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన నాలుగు కుటుంబాలకు ‘రెడ్‌క్రాస్’ ఆపన్న హస్తం అందించింది. ఇవాళ రెడ్‌క్రాస్ ఛైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు టార్పాలిన్స్, వంట సామాన్లు, దోమతెరలను అందించారు. ఈ కార్యక్రమములో రెడ్‌క్రాస్ AO సీహెచ్ చంద్రశేఖర రావు, వాలంటీర్లు, సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.